టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో రామ్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రామ్ ఈ సినిమా తర్వాత నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో స్కంద సినిమాలో రామ్ నటిస్తుండగా సెప్టెంబర్ నెల 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని రామ్ భావిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల నటించగా శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. యమదొంగలోని సినిమాలోని నాచోరే నాచోరే స్టెప్స్ లా ఈ సాంగ్ లో రామ్ స్టెప్స్ ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు మాత్రం జై లవకుశ సినిమాలోని ట్రింగ్ ట్రింగ్ సాంగ్ స్టెప్స్ ను రామ్ కాపీ కొట్టాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే స్టెప్స్ సేమ్ ఉంటే కొరియోగ్రాఫర్ ను నిందించాలే తప్ప రామ్ ను నిందించాల్సిన అవసరం ఏముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హీరో రామ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రామ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా ఆ సినిమాను మించిన సక్సెస్ ను అందుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.. రామ్, శ్రీలీల కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.