Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ వాటిపై దృష్టి పెట్టారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్30 సెట్స్ పైకి వెళ్లక ముందే తారక్ ఒక నేషనల్ బ్రాండ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

త్వరలో ఈ బ్రాండ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తారక్ ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన షూట్ లో పాల్గొంటున్నారని తారక్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ యాడ్ కోసం తారక్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో యాడ్స్ కు దూరంగా ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ వాటిపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

ఈ యాడ్ లో తారక్ స్లిమ్ లుక్ లోనే కనిపించనున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ తన రేంజ్ ను పెంచే యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తారక్ యాడ్స్ లో నటించడం ద్వారా ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంది. తారక్ రాబోయే రోజుల్లో మరిన్ని యాడ్స్ లో సైతం నటించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

తారక్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తుండగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ లు తెరకెక్కనున్నాయి. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమాలను భారీ లెవెల్ లోనే ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంపై ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus