యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడగా ఈ ఏడాది దసరా పండుగ దేవర సినిమా రిలీజ్ తో తమకు మరింత స్పెషల్ గా ఉండబోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండబోతున్నాయని ఈ మూవీ కథ, కథనం కొత్తగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో ఎన్నో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో దేవరతో ఆ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యారు.
రెండున్నర సంవత్సరాల ఫ్యాన్స్ ఎదురుచూపులకు దేవర సినిమా రూపంలో జవాబు దొరుకుతుందని ఈ సినిమాతో ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని జూనియర్ ఎన్టీఆర్ నమ్ముతున్నారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఊతపదం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ ఊతపదం గురించి తెలిసి తారక్ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
“అరే నీ” అనే పదం ఎక్కువగా తారక్ రోజులో మాట్లాడతాడని సమాచారం. రోజులో కనీసం 20 నుంచి 30 సార్లు తారక్ ఈ పదం పలుకుతాడని తెలుస్తోంది. గతంలో ఒక సందర్భంలో తారక్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఊతపదం గురించి చెప్పినట్టు తెలుస్తోంది. తారక్ 9 భాషలలో అలవోకగా మాట్లాడగలరనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
జపాన్ లో కూడా ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినిమాలను అక్కడ డబ్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నారు. మరికొన్ని రోజుల తర్వాత బృందావనం సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.