RRRతో (RRR) గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ Jr NTR) అనంతరం దేవర(Devara) తో కూడా హిందీలో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈసారి డైరెక్ట్ గా హిందీ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. తారక్ స్ట్రైట్ తెలుగు మూవీ వార్ 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan)స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ లో సర్ ప్రైజ్ ఇస్తాడాని అనిపిస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ పూర్తి కాలేదు. మొదట ముంబైలో మొదలైన షూటింగ్, అబుదాబి, లండన్ వంటి అంతర్జాతీయ లొకేషన్లలో కొనసాగింది. హాలీవుడ్ యాక్షన్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది. అయితే, సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు, రీషెడ్యూల్స్, డేట్ క్లాష్‌లు ఇలా అనేక కారణాల వల్ల ఎన్టీఆర్ షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది.
వాస్తవానికి ఎన్టీఆర్ ఇప్పటికే తన NTR 31 ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కనున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, వార్ 2 తన షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ కూడా ఆలస్యమవుతోంది. ఈ కారణంగా తారక్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక పై మరింత ఆలస్యం చేయకూడదు అంటూ సీరియస్ అయినట్లు టాక్.
యశ్ రాజ్ ఫిలిమ్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత స్థాయి టెక్నికల్ వండర్‌గా మలచాలని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. కానీ, హీరోల డేట్స్‌ను బ్యాలెన్స్ చేయడం కన్ఫ్యూజ్ అవుతోంది. దీని వల్ల ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. మొన్నటి వరకు ఓపికతో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం దర్శకుడిపై కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, వార్ 2 సినిమా 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ NTR 31 ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.