Jr NTR: సీఎం ఎన్టీఆర్ ఎంటూ ఫ్యాన్స్ నినాదాలు.. తారక్ రియాక్షన్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో తారక్ సత్తా చాటుతున్నారు. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లిన తారక్ అక్కడ ఎమోషనల్ అయ్యారు.
తాతగారికి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్ అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ కు (Jr NTR) తారక్ రావడంతో ఎక్కువ సంఖ్యలో అభిమానులు అక్కడికి హాజరయ్యారు. సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. తారక్ ఎమోషనల్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అభిమానులు సైతం ఈ ఫోటోలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అని అభిమానులు కామెంట్ చేసినా తారక్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.

మరోవైపు గుండెలను మరోసారి తాకిపో తాతా అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కు తాతపై ఉన్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. తారక్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న తారక్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను మొదలుపెడుతున్నారు. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ వరుస విజయాలతో కెరీర్ పరంగా మరింత సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. తారక్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా తారక్ కోరుకున్న సక్సెస్ లను భవిష్యత్తు సినిమాలు అందిస్తాయో లేదో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus