యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా తారక్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేవర మూవీ గ్లింప్స్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు మలయాళంలో కూడా తనే డబ్బింగ్ చెబుతానని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు.
అయితే తారక్ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. మలయాళం భాషలో డబ్బింగ్ చెప్పడం అంటే హీరోలెవరూ ఆసక్తి చూపరు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మలయాళంలో మాట్లాడటం ఒకింత కష్టమైనా ఎన్టీఆర్ మాత్రం దేవర మలయాళ వెర్షన్ గ్లింప్స్ లో అలవోకగా ఆ భాషలో మాట్లాడి ప్రశంసలు అందుకుంటున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర సినిమా పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాతలలో కళ్యాణ్ రామ్ ఒకరు కాగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
రెండు భాగాలుగా దేవర సినిమా తెరకెక్కుతుండగా (Jr NTR) తారక్ కు సంబంధించిన మరో లుక్ రివీల్ కావాల్సి ఉంది. దేవర2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. దేవర సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. నాన్ థియేట్రికల్ హక్కులతోనే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ జరిగిందని భోగట్టా. దేవర సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.