Jr NTR, Dil Raju: దిల్ రాజు కెరీర్ సక్సెస్ లో ఎన్టీఆర్ పాత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ ప్రొడ్యూసర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది దిల్ రాజు పేరు చెబుతారు. దిల్ రాజు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్ గా సైతం దిల్ రాజు కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న దిల్ రాజు రాబోయే రోజుల్లో ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎంతోమంది కొత్త డైరెక్టర్లను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు ఆయా డైరెక్టర్ల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. దిల్ రాజు పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రాండ్ గా మారిపోయింది. అయితే దిల్ రాజు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ వి.వి.వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆది మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) చిన్నప్పటి పాత్ర బాంబులు వేసే సీన్, సుమోలు పేలే సీన్ హైలెట్ గా నిలిచాయి. వాస్తవానికి ఈ రెండు సీన్లు చెప్పి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారు. అయితే కొన్ని ఏరియాలలో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాకు ముందు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన పలు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

అయితే ఆది సినిమా సక్సెస్ తో దిల్ రాజు గారి దశ మారిపోయింది. ఈ విధంగా దిల్ రాజు కెరీర్ సక్సెస్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉంది. ఆది సినిమాను వినాయక్ అద్భుతంగా తీయడంతో దిల్ రాజు వినాయక్ తో దిల్ సినిమాను నిర్మించి నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టి సౌత్ ఇండియాలో సత్తా చాటుతున్నారు. దిల్ రాజుకు సొంతంగా థియేటర్లు ఉండటంతో ఆయా థియేటర్ల ద్వారా కూడా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus