యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ హీరో అనే సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ లో పౌరాణిక పాత్రలలో నటించి మెప్పించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారని చాలా తక్కువమందికి తెలుసు. తారక్ లోని ఈ టాలెంట్ గురించి ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సినిమాలలో రభస సినిమా ఒకటి.
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్ కోసం తారక్ సొంతంగా కొన్ని స్టెప్స్ ను కంపోజ్ చేశారట. అయితే ఆ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా క్రెడిట్ తీసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపలేదట. రభస సినిమా డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమా తర్వాత తారక్ నటించిన సినిమాలేవీ నిరాశపరచలేదు.
తారక్ ప్రస్తుతం కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర మూవీ షూట్ ఏడాది ఆలస్యంగా మొదలుకావడానికి ఈ సినిమా కథే కారణమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి మేకర్స్ అంగీకరించారు. దేవర సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.
చాలా సంవత్సరాల తర్వాత (Jr NTR) తారక్ ఈ సినిమాలో తండ్రీకొడుకు పాత్రలలో నటిస్తున్నారు. ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో తండ్రీకొడుకు పాత్రల్లో తారక్ నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ సెంటిమెంట్లకు దేవరతో చెక్ పెట్టడంతో పాటు దసరాకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.