Jr NTR: ఆ రోజే నటుడుగా నేను మళ్ళీ పుట్టాను… ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నందమూరి నటి సింహం ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం ఈయన ఇండియాకు తిరిగి వచ్చారు.

ఇలా ఆస్కార్ వేడుక తర్వాత మొదటిసారి ఎన్టీఆర్ నటుడు విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ తాను ఒకే చక్రంలో ఇరుక్కుపోతున్నానని చాలా కాలానికి రియలైజ్ అయ్యాను. ఇలా రియలైజ్ అయిన నేను నా అభిమానులు కాలర్ ఎగరేసుకొని సినిమాలు చేస్తానని మాట ఇచ్చాను అలా మాట ఇచ్చిన రోజున నటుడుగా నేను మళ్ళీ పుట్టానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇలా అభిమానులకు ఇచ్చిన మాట కారణంగానే తాను విభిన్నమైన సినిమా కథలను ఎంచుకొని నటిస్తున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే మీరు కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తున్నానని అనుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. ఇక విశ్వక్ కూడా ఒకే తరహా పాత్రలలో కాకుండా బయటకు వచ్చి విభిన్న కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ఈయన తెలిపారు.

ఇక విశ్వక్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమాని కూడా ప్రతి ఒక్కరు ఆదరించాలని ఎన్టీఆర్ తెలిపారు.ఇక ఈ సినిమాకు విశ్వక్ దశకత్వం వహించారు. అయితే ఇకపై తాను ఏ సినిమాకి దర్శకత్వం వహించకూడదని ఎన్టీఆర్ తెలిపారు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులకు యంగ్ హీరోలు అందరూ అవకాశాలు కల్పించాలని ఈయన తెలిపారు. ఇలా తారక్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus