ఎన్టీఆర్ హీరోగా ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. నాగవంశీ దీనికి నిర్మాత అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ‘అందులో హీరో ఎవరో క్లారిటీ లేదు’ అంటూ ఇటీవల నాగవంశీ బాంబ్ పేల్చాడు. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..” ‘అత్తారింటికి దారేది’ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది.
మీ వెనకాల కనపడని ఒక శక్తి ఉంది అని..!వీళ్లందరి వెనకాల ఉన్న కనపడని ఆ శక్తినే మా చింటు.. వంశీ. ఇప్పటివరకు అతనంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. మాట కరుకు.. కానీ మనిషి చాలా అంటే చాలా మంచోడు. కాకపోతే బాగా సుఖపడి పోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత ఒకరోజు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో.. అతనే ప్రొడ్యూసర్ గా, ప్రెజెంట్స్ వంటివి కాదు.
వంశీ ప్రొడ్యూసర్ గా పేరు పడిన రోజు ఆ సినిమా మొదలైన రోజు.. ‘మీ అందరినీ హ్యాండిల్ చేయమని’ తనని వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా… కొట్టుకోవాలన్నా వంశీనే ఇన్చార్జి మీకు.’ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో సునీల్ ‘అనుభవించు రాజా’ అంటూ వెంకటేష్ గారిని పంపించేయగానే కూర్చుని ఎంజాయ్ చేస్తాడు చూడు.
నేను అలా ఎంజాయ్ చేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు” అంటూ చెప్పుకొచ్చాడు. సో నెల్సన్ మూవీ పై ఎన్టీఆర్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :
అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది.. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉందని
వీళ్ళందరి వెనకాల ఉన్న ఆ శక్తి మా చింటు (వంశీ)#JrNTR #NagaVamsi #Chintu #NTRForMAD #MadSquare pic.twitter.com/6oterVeLt4— Filmy Focus (@FilmyFocus) April 4, 2025
త్వరలోనే వంశీ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నా
మీరు తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా వంశీ ఇంచార్జ్..#JrNTR #NagaVamsi #NTRForMAD #MadSquare pic.twitter.com/ar35mVEGId— Filmy Focus (@FilmyFocus) April 4, 2025