ఎన్టీఆర్ లుక్స్ రోజు రోజుకీ షాకిస్తున్నాయి. ఎన్టీఆర్ బరువు తగ్గిన దగ్గర్నుండి ఫిట్ నెస్ బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. బయట ఫుడ్ తినడం కంప్లీట్ గా మానేసి.. ఇంట్లో చేసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ బెస్ట్ కుక్ అని ఇండస్ట్రీ జనాలు అంతా చెబుతుంటారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ టైంలో కూడా ఎన్టీఆర్.. ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ తీసుకునే వారు. మొన్నామధ్య ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సక్సెస్ మీట్ కి వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ మరింత స్లిమ్ అయినట్టు కనిపించాడు.
అదే ఈవెంట్లో అతను తీసుకుంటున్న వాటర్ బాటిల్స్ కూడా చాలా కాస్ట్ తో కూడుకున్నవి. ఇవన్నీ చూసి ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ పడుతున్న కష్టం అని అంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మొన్నామధ్య ఎన్టీఆర్ డూప్ ఒకతను.. ‘ఎన్టీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదని, వార్ 2 సినిమా సెట్స్ లో చాలా కష్టపడ్డాడని, యాక్షన్ సీన్స్ లో ఎక్కువ శాతం అతనే చేసినట్టు చెప్పుకొచ్చాడు. అవి ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి. అయితే రాను రాను ఎన్టీఆర్ మరింతగా బక్కచిక్కిపోతున్నాడు.

‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ లుక్ చూసి చాలా మంది ‘కంత్రి’ లుక్ అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్..లో దర్శనమిచ్చాడు. బ్లాక్ ఔట్ ఫిట్స్ లో మంచి ఫోజులు ఇచ్చాడు కానీ.. మరింత లీన్ గా, గుబురు గడ్డంతో కనిపించడంతో అభిమానులు మళ్ళీ కంగారు పడుతున్నారు.రెండు, మూడు రోజుల క్రితం ‘శివ’ రీ- రిలీజ్ సందర్భంగా ఇచ్చిన బైట్లో కూడా ఇలానే కనిపించాడు ఎన్టీఆర్.
