జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆచార్య (Acharya) తర్వాత కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానుల్లో చిన్నచిన్న అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలను ఎన్టీఆర్ పటాపంచలు చేశారు. దేవర మూవీ నార్త్ ఇండియాలో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా తారక్ అడుగులు పడుతున్నాయి. కరణ్ జోహార్ (Karan Johar) చేతికి దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ దక్కాయి.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతంలో ఈ నిర్మాణ సంస్థ బాహుబలిని (Baahubali1) డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ హిందీలో దేవరను రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంది. ఈ సంస్థ సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా దేవర నార్త్ ఇండియాలో కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.
దేవర మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సినిమా సాంగ్స్ గురించి విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దేవర సాంగ్స్ అద్భుతంగా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి.
దేవర సినిమా రిలీజ్ కు సరిగ్గా ఆరు నెలల సమయం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా తారక్ ఎక్కువ సమయం కేటాయించనున్నారని భోగట్టా. దేవర సినిమా ఇతర సౌత్ భాషల్లో సైతం గ్రాండ్ గా రిలీజ్ కానుందని తెలుస్తోంది. మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.