Jr NTR , Buchi Babu: తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ ఆలస్యానికి కారణమిదే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కాంబో మూవీ ఆలస్యం కావడానికి సెకండాఫ్ కారణమని సమాచారం అందుతోంది. కథ బాగానే ఉన్నా సెకండాఫ్ మరింత అద్భుతంగా ఉంటే బాగుంటుందని తారక్ అభిప్రాయం.

బుచ్చిబాబు ఇప్పటికే పలు మార్పులు చేసినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో సంతృప్తి కలగలేదని బోగట్టా. ఈ సినిమా స్క్రిప్ట్ పై సాధ్యమైతే బుచ్చిబాబుకు కొంతమేర సహాయం చేయాలని దర్శకుడు సుకుమార్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడిగారని సమాచారం. సుకుమార్ కూడా అందుకు అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే తారక్ బుచ్చిబాబు కథను ఓకే చేసినా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను పూర్తి చేసి తారక్ ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. 2024లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. బుచ్చిబాబు మరో హీరోతో ఒక సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని తారక్ కోసం వేచి ఉండటం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై బుచ్చిబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఉప్పెన సినిమా సక్సెస్ తో బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరగా బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు మాత్రం మరో సినిమాను తెరకెక్కించి ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే తారక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని పోగొట్టుకుంటానని భావిస్తున్నారని తెలుస్తోంది. దర్శకుల కెరీర్ కు ప్రతి సినిమా సక్సెస్ కీలకం కావడంతో తారక్ సినిమాపై బుచ్చిబాబు చాలా ఆశలు పెట్టుకున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus