జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివతో మరొక పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా మంచి సోషల్ మెసేజ్ తో ఉంటుందని అని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. జనతా గ్యారేజ్ సక్సెస్ అనంతరం కొరటాల శివ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో తెలుగులో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు దర్శకుడు ఒక టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సినిమాలో ఫస్టాఫ్లో ఒక మాదిరిగా కనిపించే ఎన్టీఆర్ సెకండాఫ్లో మరొక విధంగా కనిపిస్తాడట. సినిమా కథ ఒక కార్పొరేట్ కు అలాగే కామన్ మ్యాన్ కు మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా నేషనల్ లెవెల్లో రాజకీయ అంశాలు కూడా ఉంటాయట. ఒక పవర్ఫుల్ సిస్టమ్ ను కామన్ మ్యాన్ ఎదిరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ విభిన్నంగా చూపించబోతున్నరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక కామన్ మ్యాన్ మాదిరిగా పవర్ఫుల్ సిస్టమ్ ను ఎదురిస్తూనే..
స్టార్ హీరోగా కూడా పవర్ఫుల్ గా కనిపించాలని అందుకోసం ఈ విషయంలో రెండు విధాలుగా లుక్స్ మార్చాల్సి ఉంటుంది అని కొరటాల చెప్పాడట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫస్టాఫ్ లో ఒక విధంగా సెకండాఫ్ లో మరొక విధంగా కనిపించే విధంగా వర్కౌట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనిరుధ్ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక సినిమాను ఇదే నెలలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.