‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నుండీ ఇప్పటి వరకూ చాలా మల్టీ స్టారర్ లు వచ్చాయి. అయితే అలా వచ్చిన సినిమాల్లో ఒకరు స్టార్ హీరో అయితే మరొకరు మీడియం రేంజ్ ఉన్న హీరో మాత్రమే..! ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని తీసుకుంటే అందులో మహేష్ స్టార్ హీరో అయితే వెంకీ సీనియర్ స్టార్ హీరో .. అలా అది సెట్ అయ్యింది. ‘గోపాల గోపాల’ ‘ మసాలా’ ‘ఎఫ్2’ ‘దేవదాస్’ ‘వెంకీమామ’ ఇలా అన్ని మల్టీ స్టారర్ లు అదే కోవలోకి వస్తాయి.
కానీ మొదటి సారి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’…’రౌద్రం రణం రుథిరం’. చరణ్, ఎన్టీఆర్ లతో ఏకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈరోజు అంటే మార్చి 27న చరణ్ పుట్టినరోజు కాబట్టి …ఆయన పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబందించి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసారు.’భీమ్ ఫర్ రామరాజు’ అంటూ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ సాగింది. ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్ అదిరింది. అల్లూరి ఉక్కు మనిషి లా ఉండేవాడు అని ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు.
అందుకు తగినట్టుగానే ఉన్నాడు చరణ్ .. అదే మన యంగ్ అల్లూరి. అయితే ఈ వీడియో మొత్తానికి ఎన్టీఆర్ హైలెట్ అయ్యాడు. అతను వాయిస్ ఓవర్ .. ప్రతీ ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. తెలుగు , హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఎన్టీఆర్ ట్యాలంట్ గురించి ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకి మాత్రమే తెలుసు… ఈ వీడియోతో ఇండియా మొత్తం అతని గురించి మాట్లాడేలా చేసింది ఈ గ్లింప్స్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘జక్కన్న ….చరణ్ పేరు చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు ఏంటి’ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే… మరికొందరు మాత్రం ఇద్దరి స్టార్ హీరోలను ఒకేసారి హైలెట్ చేయడం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.