Jr NTR: గర్వంగా ఉంది… నాటు నాటు ఆస్కార్ నామినేషన్ పై స్పందించిన తారక్!

95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో భాగంగా నాటు నాటు పాట నామినేషన్లు చోటు దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఈ సినిమా రెండు కేటగిరీలలో పోటీ పడుతుందని అందరు భావించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉంటుందని

అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో భాగంగా ఎన్టీఆర్ పేరు కూడా నామినేషన్ లో ఉంటుందని అందరూ భావించారు. అయితే ఈ నామినేషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ ఎంతో ఒదిగిపోయిన నటించారని ముఖ్యంగా కొమరం భీముడో పాత్రలో ఎన్టీఆర్ నటన పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఎన్టీఆర్ పేరు ఆస్కార్ నామినేషన్ లో ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడం చాలా గర్వంగా అనిపిస్తుందని ఈయన ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. ఇక ఈ పాటకు సంగీత అందించిన ఎం ఎం కీరవాణి పాటల రచయిత చంద్రబోస్ గారికి అభినందనలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus