Jr NTR: యంగ్ టైగర్ రిక్వెస్ట్ ను కొరటాల శివ అంగీకరించారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా అదే కాంబినేషన్ లో ప్రస్తుతం దేవర సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా డైలాగ్స్ కు సంబంధించి తారక్ కొరటాల శివకు కొన్ని సూచనలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ సినిమాలలో డైలాగ్స్ కొంచెం క్లాస్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.

అయితే దేవర సినిమాలో మాస్ డైలాగ్స్ ఉండేలా చూసుకోవాలని కొరటాల శివకు తారక్ సూచనలు చేశారని తారక్ సూచనలను కొరటాల శివ అంగీకరించారని భోగట్టా. దేవర సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే ఊరమాస్ డైలాగ్స్ ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సెంటిమెంట్ పరంగా ఏప్రిల్ నెల జూనియర్ ఎన్టీఆర్ కు లక్కీ మంత్ కాకపోయినా ఈ సినిమాతో సెంటిమెంట్ కు అతీతంగా సక్సెస్ సాధిస్తానని తారక్ భావిస్తున్నారు. భవిష్యత్తు సినిమాలతో తారక్ చరిత్ర సృష్టిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉండగా తారక్ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అత్యంత భారీ స్థాయిలో ఉంది.

తారక్ రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. తారక్ సొంత బ్యానర్ లో సినిమాలలో నటించడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ బ్యానర్ గా నిలిచేలా తారక్ తన వంతు కష్టపడుతున్నారు. తారక్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus