Jr NTR, Samantha: సమంత ఎమోషనల్ పోస్ట్ పై స్పందించి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం తన జీవితంలో గడ్డుకాలాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసింది. అంతేకాకుండా తానూ ఓ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు కూడా తెలిపి అటు ఆమె అభిమానులను ఇటు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. “కొన్నినెలల క్రితం నాకు మ్యోసిటీస్‌ అనే వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని మీ అందరితో చెప్పుకోవాలి అనుకున్నాను.

కానీ, అందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రతిసారి ఇలాంటి విషయాలు తొందరపడి బయటకు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పరిస్థితినైనా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. త్వరలో నేను పూర్తిగా కోలుకుంటానంటూ వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా నాకు ఎన్నో మంచి రోజులు, కొన్ని చెడు రోజులు ఉన్నాయి.కానీ అన్నీ క్షణాల్లోనే గడిచిపోయాయి. ఇది కూడా అలానే గడిచిపోతుంది” అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఇందుకు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న సెలబ్రిటీలు ‘నీకేం కాదు’ అంటూ ధైర్యం చెబుతున్నారు. అభిమానులు అయితే నువ్వు త్వరగా కోలుకొని బయటకు వస్తావు. ఆందోళన చెందకు అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సమంతకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. “గెట్‌ వెల్‌ సూన్‌ సామ్. సెండింగ్‌ యూ ఆల్‌ ది స్ట్రెంత్” అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు ఎన్టీఆర్.వీరిద్దరూ కలిసి గతంలో ‘బృందావనం’ ‘రామయ్యా వస్తావయ్యా’ ‘రభస’ ‘జనతా గ్యారేజ్’ వంటి చిత్రాల్లో జంటగా నటించారు.

ఇక సమంత ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదుగుతుంది. ఇలాంటి టైంలో ఆమె హెల్త్ అప్సెట్ అవ్వడం అనేది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోపక్క సమంత నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 11న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అవ్వగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus