Jr NTR, Mahesh Babu, Rajamouli: జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన తారక్!
- December 6, 2021 / 06:43 PM ISTByFilmy Focus
రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా 4 సినిమాల్లో నటించారు. రాజమౌళి తారక్ కాంబోలో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా మూడేళ్లు మరే సినిమాలో నటించలేదు. రాజమౌళి డైరెక్షన్ లో నటించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. జక్కన్న తన సినిమాల కోసం హీరోలను ఎంతో కష్టపెడతారు. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు రాజమౌళి రాజీ పడరు.
తాజాగా ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాజమౌళి గురించి చెబుతూ ఎన్టీఆర్ మహేష్ ను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ మహేష్ ను ఆటలు ఆడతారా? అని ప్రశ్నించగా మహేష్ ఒకప్పుడు ఆడేవాడినని ఇప్పుడు ఆడటం లేదని చెప్పుకొచ్చారు. క్రికెట్ ఆడతారా అని ఎన్టీఆర్ అడగగా మహేష్ ఆడతానని చెప్పారు. ఆ తర్వాత రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ తో ఆడతానని క్రికెట్ బాల్ అంటే కష్టమని మహేష్ ఆట పట్టించడం గమనార్హం.

ఆ తర్వాత జక్కన్నతో సినిమా చేస్తున్నారుగా ఇకపై అన్ని ఆటలు ఆడతారని ఎన్టీఆర్ మహేష్ తో అన్నారు. రాజమౌళి ఏం ఆడిస్తారని మహేష్ అడగగా నాకు అనుభవం ఉందని రాజమౌళితో సినిమా అంటే ఇకపై నీకు కూడా తెలుస్తుందని తారక్ షాకింగ్ కామెంట్లు చేశారు. మహేష్ తో కూడా జక్కన్న గేమ్స్ ఆడిస్తాడని ఎన్టీఆర్ మహేష్ ను భయపెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది.
అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

















