యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో తారక్ కొత్త కథలు కూడా వింటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. తారక్ హాయ్ నాన్న (Hi Nanna) డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వినిపించాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు గతంలో సుధీర్ వర్మ (Sudheer Varma) , తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కూడా కథలు చెప్పారని భోగట్టా. అయితే తారక్ వైపు నుంచి అధికారికంగా క్లారిటీ రాకపోవడంతో యంగ్ డైరెక్టర్లతో సినిమా విషయంలో తారక్ వెనుకడుగు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కు భారీ విజయాలు దక్కడానికి యంగ్ డైరెక్టర్లు కారణం కాగా ప్రస్తుతం తారక్ అలాంటి దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్ట్ విషయంలో తారక్ ఒకటికి రెండుసార్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో తారక్ కు పారితోషికం దక్కుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వరుస విజయాలు సాధించేలా తారక్ కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ షూట్ అతి త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ తారక్ తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.