టాలీవుడ్ లో దాదాపుగా 40కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన సినిమా రాజమౌళి మగధీర. అయితే అప్పట్లో ఆ సినిమా టాలీవుడ్ కలెక్షన్స్ లో ఒక సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే అదే తరహాలో జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ టాలీవుడ్ రికార్డ్స్ ను షేక్ చేసి మరీ దాదాపుగా 80కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే ఆ మార్క్ ను మిగిలిన సినిమాలు ఏవీ అందుకోలేక పోయాయి. అయితే మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ మాత్రం దాదాపుగా 80కోట్ల వరకూ వసూళ్లు సాధించి రెండి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక అదే తరహాలో బాహుబలిని మించి ఇరగదీద్దాం అని అనుకున్న బ్రూస్ లీ, సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడం తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదు.
ఆ రకంగా చూసుకుంటే కొంతలో కొంత బన్నీ సరైనోడు కాస్త బెట్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమాకు తొలి షో నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా బన్నీ స్టామినా పుణ్యమా అని సినిమా దూసుకుపోతుంది. ఇక మొత్తంగా 60కోట్ల వరకూ సినిమా వసూళ్లు . అవకాశం ఉంది అంటునన్నారు ట్రేడ్ పండితులు. ఇక అదే క్రమంలో అందరి అసలు…ఆలోచనలు అంతా యంగ్ టైగర్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు జూనియర్ కెరియర్ లో అత్యధికంగా వసూలు చేసింది 50 కోట్లు షేర్ మాత్రమే. అది కూడా నాన్నకు ప్రేమతో సినిమాతో సాధ్యం అయ్యింది. ఇకపోతే ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. అతగాడి శ్రీమంతుడు 80 కోట్లు వసూలు చేసింది కాబట్టి.. పంపిణీదారులు ‘జనతా గ్యారేజ్’ సినిమాను దాదాపు 68-70 కోట్ల రూపాయలతో కొన్నారు. కాని అంత మొత్తం రికవర్ చేయాలంటే మాత్రం కాస్త కష్టం అనే చెప్పాలి. మరి జనత గ్యారేజ్ ఎంతవరకూ వసూళ్లు సాధిస్తుందో, ఎన్ని రికార్డ్స్ క్రాస్ చేస్తుందో చూద్దాం.