ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో చరిత్రను వక్రీకరించారని అల్లూరి సౌమ్య అనే మహిళ కోర్టును ఆశ్రయించింది. తాజాగా అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు అయిన పడాల వీరభద్రరావు ఆర్ఆర్ఆర్ మూవీ కథ విషయంలో ఫైర్ అయ్యారు. బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా అల్లూరి సీతారామరాజును చూపించడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవైపు కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుతుండగా మరోవైపు కోర్టులో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి వరుసగా దాఖలవుతున్న పిటిషన్లు అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. మరోవైపు 2023 సంక్రాంతికి ఎన్టీఆర్, చరణ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారని సమాచారం అందుతోంది. చరణ్ శంకర్ కాంబో మూవీ 2023 సంవత్సరం సంక్రాంతికి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ కూడా అప్పుడే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే కరోనా కేసుల వల్ల రిలీజ్ డేట్లు ప్రకటించిన సినిమాలే అనుకున్న తేదీలకు రిలీజవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చరణ్ తారక్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడతారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. చరణ్, తారక్ మంచి స్నేహితులు కావడంతో భవిష్యత్తులో ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలలో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కరోనా వల్ల పెద్ద సినిమాలు వాయిదా పడుతుండటంతో పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా ఈ సినిమా రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.