ఎన్టీఆర్ రేర్ పిక్ వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 70శాతం పూర్తయ్యింది. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ 2వ వారం నుండీ తిరిగి షూటింగ్ మొదలుపెట్టడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?’ అంటూ ఆయన అభిమానులు ఆ ఫోటోని తెగ షేర్లు చేస్తున్నారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలు ఫాలో అయిన వాళ్లకు ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈమె ఎవ్వరో ఇట్టే అర్ధమైపోతుంది. ఆమె మరెవరో కాదు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని. ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండీ ఈమె పోటీ చేసింది. ఫలితం సంగతి పక్కన పెడితే.. తమ్ముడు తారక్ అంటే ఈమెకు చాలా ఇష్టం.

వారి అనుబంధం ఎలాంటిదో ఈ ఫోటో స్పష్టంచేస్తోంది. ఎన్టీఆర్ తన ప్రతీ సినిమాని విడుదలకు ముందు సుహాసినికి చూపిస్తాడట. ఈమె సలహాలు, సూచనలు కూడా తీసుకుంటాడట. ప్రతీ ఏడాది రాఖీ పండుగ రోజున.. తారక్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సుహాసిని ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటాడట. తమ్ముడుకి కుదరని పక్షంలో సుహాసినినే స్వయంగా సెట్స్ కి వెళ్లి మరీ తారక్ కు రాఖీ కట్టి వస్తుందని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus