‘దేవర’ (Devara) సినిమాను ఇంకాస్త పకడ్బందీగా తెరకెక్కించి ఉంటే.. రూ. వెయ్యి కోట్లు వచ్చేవి, విదేశాల్లోనూ రిలీజ్ అయ్యేది అనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అలా జరిగేదో లేదో తెలియదు కానీ.. ‘దేవర’ మేనియాను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ పార్టనర్ మాత్రం భారీ ప్లాన్స్ వేస్తోంది. అదేంటి ఇంకా హిందీలోనే రిలీజ్ చేయలేదు కదా అని మీరు అనొచ్చు. అవును హిందీ రాలేదు.. ఇంకా చాలా వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఓసారి ‘దేవర’ సినిమా డీటైల్స్ లోకి వెళ్లండి.
Devara
ఆ తర్వాత ఆడియో – లాంగ్వేజెస్‌లోకి వెళ్లండి. ఊహించని నాలుగు భాషల పేర్లు కనిపిస్తాయి. హిందీ రిలీజ్ విషయంలో ఎందుకో కానీ నెట్‌ఫ్లిక్స్ ఇబ్బందులు పడుతోంది. కానీ ఇప్పుడు సినిమాను ఇంగ్లిస్, బ్రెజిలియన్ పోర్చుగీస్, కొరియన్, స్పానిష్ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఈ మేరకు మార్పులు చేశారు. మామూలుగా అయితే తెలుగు సినిమాలు, అందులోనూ తారక్ సినిమాలు జపాన్, కొరియాలో బాగా ఆడతాయి. గతంలో మనం ఈ ట్రెండ్‌ని చూశాం కూడా.
అయితే జపనీస్ లాంగ్వేజ్ ఇంకా యాడ్ చేయలేదు. త్వరలో యాడ్ చేస్తారు అని సమాచారం. సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు అందుకున్నా.. ఫ్యాన్స్‌లో మేకింగ్ విషయంలో వెలితి అలానే ఉంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే, అనూహ్యంగా నెట్‌ఫ్లిక్స్ చేసిన పనికి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు. మా హీరో రేంజి ఇది అంటూ మురిసిపోతున్నారు. మరి ఆయా లాంగ్వేజెస్‌లో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఒకవేళ బాగుంటే టాలీవుడ్ సినిమాల టీమ్స్ నెట్‌ఫ్లిక్స్‌ను ఈ విషయంలో రిక్వెస్ట్‌లతో ముంచెత్తుతాయి అని చెప్పాలి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించారు. ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉంటుందని తొలుతే చెప్పారు. అయితే తారక్ (Jr NTR) వరస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.