ఓ విధంగా మొదటి పాన్ ఇండియా నటి సిల్క్ స్మితనే అయ్యుంటుంది. ఎందుకంటే.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో ఆమె బిజీ ఆర్టిస్ట్ గా రాణించింది. 1980, 90 ల కాలంలో ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఈమె సినిమాల్లో ఒక్క పాట చేస్తుంది అంటే ఎగబడి థియేటర్ కు వెళ్లే వారి సంఖ్య కూడా ఉండేది.
కేవలం సిల్క్ స్మిత క్రేజ్ తోనే గట్టెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయంటే నమ్మడం కష్టం కానీ అది నిజం. అంత స్టార్ డమ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత.అయితే తర్వాత ఆమె ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అందుకు కారణాలు ఏంటి అన్నది ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అటు తర్వాత కొంత కాలానికే 1996 సెప్టెంబర్ 23న ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈమె చనిపోయింది అంటే మామూలు షాకింగ్ విషయం కాదు అది.
సిల్క్ స్మిత (Vishnu Priya) బలవన్మరణానికి కారణాలు ఏంటి అంటే కచ్చితంగా ఎవ్వరికీ తెలీదు. అయితే రెండు రోజులుగా సిల్క్ స్మితని పోలిన ఓ అమ్మాయి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ‘జూనియర్ సిల్క్ స్మిత’ ‘సిల్క్ స్మిత మళ్ళీ పుట్టింది’ అంటూ కొంతమంది నెటిజన్లు ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు విష్ణు ప్రియా. ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?