సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కరికాలన్ గా నటించిన చిత్రం కాలా. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. సూపర్ స్టార్ గత చిత్రాల కంటే ఎక్కువగా బిజినెస్ జరగడం విశేషం. వీరిద్దరి కాంబినేషనలో వచ్చిన గత చిత్రం కబాలి అప్పట్లో మొత్తం కలిపి 218 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, ‘కాలా’ 230 కోట్ల బిజినెస్ చేసింది. తమిళనాడులో 60 కోట్లకు ‘కాలా’ డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగు, మలయాళంలో ‘కాలా ‘కి 43 కోట్లు వచ్చాయి. కేరళలో 10 కోట్లకు అమ్ముడుపోగా .. తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఓవర్సీస్‌లో రజినీకాంత్ కి మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో 45 కోట్ల బిజినెస్ చేసింది.
యూఎస్ఏతో పాటు మలేషియా, జపాన్, సింగపూర్ దేశాల్లో కాలాన్ని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈరోజు నుంచే ప్రీమియం షోలు ప్రదర్శితం కానున్నాయి. కర్ణాటకలో వివాదం కారణంగా ఈ సినిమాని ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఆ రాష్ట్రంలో బిజినెస్ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలో 155 కోట్ల బిజినెస్ చేసింది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధర పలికింది. ‘కాలా’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ లకు 70 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూపంలో మరో 5 కోట్లు అందాయి. ఇలా ‘కాలా’ మొత్తం 230 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రేపు విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.