Kajal: గుర్రపు స్వారీ చేస్తూ రచ్చ చేస్తున్న కాజల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. ఇలా వరస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా ఎంతో కాలం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ 2020 సంవత్సరంలో గౌతం కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే కొంతకాలం క్రితం గర్భం దాల్చిన కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత మూడు నెలల పాటు కేవలం ఇంటికే పరిమితమైన కాజల్ మళ్లీ సినిమాలలో నటించటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పుల నుండి బయటపడి మునపటిలా తన శరీర ఆకృతిని మార్చుకోవడానికి కఠినమైన వ్యాయామాలు చేస్తుంది.

ఈ క్రమంలో ఇటీవల ఈ అమ్మడు గుర్రపు స్వారీ కూడా చేసింది. గర్భం దాల్చకముందు కాజల్ తన రోజువారి వ్యాయామాలలో గుర్రపు స్వారీ చేసేది. కానీ ఆ తర్వాత ఇటువంటి కఠిన వ్యాయామాలకు దూరంగా ఉంది. బిడ్డ పుట్టిన తర్వాత చాలా కాలానికి మళ్లీ ఈ అమ్మడు గుర్రపు స్వారీ ఇలాంటి కఠినమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కాజల్ గుర్రపు స్వారీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలో కాజల్ మాట్లాడుతూ తల్లయిన సమయంలో శరీరంలో వచ్చి మార్పుల వల్ల ఎవరి సహాయం లేకుండా సొంతంగా గుర్రపు స్వారీ చేయటం అంత సులభమైన పని కాదు అంటూ వెల్లడించింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని మనోధైర్యంతో జీవితంలో ముందుకు నడవాలి అంటూ ఈ అమ్మడు వెల్లడించింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus