సూర్యతో లిప్ లాక్.. సీక్రెట్ బయటపెట్టేసిన కాజల్..!

‘బిగ్ బాస్’ మాత్రమే కాదు… లిప్ లాక్ ల సంస్కృతి కూడా నార్త్ నుండే వచ్చింది.. అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సౌత్ సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు అనేవి సర్వ సాధారణమైన విషయం అయిపోయింది. అయితే తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం లిప్ లాక్ లకు అలాగే ఇంటిమేట్ సీన్లకు దూరంగా ఉంటూ వస్తాడు.ముఖ్యంగా పెళ్ళైన తరువాత లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు సూర్య. అయితే కె.వి.ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రదర్స్’ అనే చిత్రంలో సూర్య, కాజల్ మధ్యను ఓ ఘాటు లిప్ లాక్ ఉంటుంది.

అప్పటికి కాజల్ అయితే ‘ఆర్య2’ ‘బిజినెస్ మెన్’ వంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్లలో నటించింది. కానీ సూర్య మాత్రం అలాంటి సీన్లకు దూరంగా ఉంటాడు. అలాంటప్పుడు ‘బ్రదర్స్’ సినిమాలో అతను లిప్ లాక్ సీన్లోఎలా పాల్గొన్నాడు అని కాజల్ నే అడిగితే.. ‘అది ఫేక్ లిప్ లాక్’ అని తేల్చిపడేసింది. ఆమె మాట్లాడుతూ.. ” ‘బ్రదర్స్’ షూటింగ్ టైంలో లిప్ లాక్ సీన్ గురించి డైరెక్టర్ కె.వి.ఆనంద్ వివరిస్తున్నప్పుడు… నేను అలాగే సూర్య చాలా ఇబ్బందిగా ఫీలయ్యాము. సూర్య అయితే చాలా ఇబ్బందిగా కనిపించాడు. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం కాబట్టి.. కె.వి.ఆనంద్ అందుకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏర్పాటు చేశాడు.

ఓ బ్లూ మ్యాట్ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ పై ముద్దు పెట్టించాడు. అటు తర్వాత నన్ను కూడా ఒక యాంగిల్లో కూర్చోబెట్టి ఒక బొమ్మ పై ముద్దు పెట్టించాడు. ఈ రెండు షాట్లను వి.ఎఫ్.ఎక్స్ టీంకు అప్పగించాడు. అలా మేమిద్దరం లిప్ లాక్ చేసుకున్నట్టు ఆ సీన్ రెడీ అయ్యింది. సినిమాలో చూస్తే అది ఒరిజినల్ లిప్ లాక్ లానే అనిపిస్తుంది కానీ.. అది ఒరిజినల్ కాదు” అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus