Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాజల్‌ ఏం చెప్పిందో చూశారా..!

పండంటి బిడ్డ కావాలంటే మనసు, ఆరోగ్యం చక్కగా చూసుకోవాలని చెబుతుంటారు పెద్దలు. అందుకే ప్రెగ్నన్సీ టైమ్‌లో ఏమేం తినాలి, ఎలా తినాలి అనే వివరాలు కూడా చెబుతుంటారు. దాంతోపాటు ఏ ఇద్దరి ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవు. ఎవరికి ఏం నచ్చుతుంది అని మనం పక్కాగా చెప్పలేం. అలా ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ ఏమేం తినాలని అనుకుంటోంది, ఏమేం తింటోంది లాంటి వివరాలు వెల్లడించింది. తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఈ వివరాలు రాసుకొచ్చింది.

Click Here To Watch

కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. గర్భవతి అవ్వడంతోనే సైన్‌ చేసిన సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఈ విషయం తొలి రోజుల్లో కాజల్‌ చెప్పకపోయినా… ఆ తర్వాత గౌతమ్‌ కిచ్లూ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. వెయిటింగ్‌ ఫర్‌ బేబీ అనే అర్థం వచ్చేలా ఓ పోస్ట్‌ పెట్టాడు. అప్పుడు అందరూ కన్‌ఫామ్‌ అయ్యారు. ఇటీవల కాజల్‌ బేబీ బంప్‌తో ఫొటలు కూడా షేర్‌చేసింది. తాజాగా తింటున్న ఆహారం ఫొటోలు షేర్‌ చేసింది.

తాజాగా కాజల్‌ అగర్వాల్‌ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలతో కొన్ని పొటోలు దిగింది. వాటినే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. గర్భం ఉన్న సమయంలో నాకు ఇలాంటి ఆహారం తినాలని అనిపిస్తోంది అంటూ ఆ పోస్టుల్లో రాసుకొచ్చింది. బ్యాక్‌లావా, బుట్ట కేక్‌లు, క్రోక్‌బౌచే వంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నా అంటూ ఆ పోస్టుల్లో రాసుకొచ్చింది. దాంతోపాటు ‘మీరే ఆహారం తీసుకుంటారో చెప్పండి’ చెప్పండి అభిమానుల్ని అడిగింది కాజల్‌. బేబీ బంప్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేసినప్పుడు కొంతమంది ఆమె మీద విమర్శలు చేశారు.

వారి మీద కాజల్‌ మండిపడుతూ దయతో మెలగడం నేర్చుకుందామని, అలా ఉండటం కష్టం అనుకుంటే… బతుకుతూ ఇంకొకరిని బతకనివ్వండంటూ కామెంట్‌ చేసింది. గర్భాధారణ సమయంలో శరీరం బరువు పెరగడంతోపాటు అనేక మార్పులు వస్తాయి. ప్రసవం తర్వాత మనుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. లేదా గర్భం దాల్చడానికి ముందున్న స్థితికి రాలేకపోవచ్చు అని చెప్పింది. అయినా ఈ మార్పులు సహజమైనవని, జీవితంలో అందమైన, విలువైన దశలో ఉన్నప్పుడు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదని ఆమె సూచించింది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus