Kajal Aggarwal: కాజల్‌ తెలివి మామూలుగా లేదు.. ఈ రోజుల్లో కూడా.!

గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు పెద్దలు. అలా అని వృత్తి మానేమయిన కాదు. ఈ విషయాన్ని అక్షరాలా చేసి చూపిస్తోంది కాజల్‌ అగర్వాల్‌. గర్భవతి అని తెలిసినప్పటి నుండి కాజల్‌ సినిమాలు అయితే మానేసింది. కానీ తన సంపాదనను మాత్రం మానుకోలేదు. వెండితెరకు రెస్ట్‌ ఇవ్వడంతో సోషల్‌ మీడియాను పక్కాగా వాడుకుంటోంది. ఇటీవల కాలంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే… చాలా బ్రాండ్స్‌ కొలాబరేషన్‌ కనిపిస్తోంది. ఇదంతా ఆమె సంపాదనే.

Click Here To Watch NOW

అందరిలాగే గర్భవతి కాగానే… కాజల్‌ కూడా సైలెంట్‌ అయిపోతుంది అనుకున్నారంతా. కానీ బాలీవుడ్‌ కథానాయికలు కరీనా కపూర్‌, అనుష్క శర్మ స్టైల్‌లో కాజల్‌ అగర్వాల్‌ సంపాదనా మార్గం ఎంచుకుంది. తను ఉన్న పరిస్థితికి తగ్గట్టు యాడ్స్‌ చేయడం మొదలుపెట్టింది. పనిలో పనిగా గర్భవతులకు అవసరమైన టిప్స్‌, ఆరోగ్య సూత్రాలను కూడా చెబుతూ వస్తోంది. రీసెంట్‌గా కాజల్‌ ఇన్‌స్టా పోస్టులు చూస్తే చెప్పేయొచ్చు. ఎంతగా తన స్టైల్‌ మారిపోయిందో. సాధారణంగా హీరోయిన్లు గర్భం దాల్చగానే సినిమాలకు దూరం అవుతారు.

వాళ్ళకి బ్రాండ్స్ ద్వారా వచ్చే సంపాదన కూడా పడిపోతుంది. ఎందుకంటే కడుపుతో ఉన్న హీరోయిన్లతో యాడ్స్ షూట్ చెయ్యలేరు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ ఫుల్లుగా సంపాదిస్తోంది. తల్లుల, కాబోయే తల్లులకు సంబంధించిన బ్రాండ్స్‌ యాడ్స్‌కు ఇటీవల కాలంలో కాజల్‌ ఎక్కువగా సైన్‌ చేసిందని సమాచారం. మరో రెండు నెలల్లో కాజల్‌ డెలివర్ డేట్ అని తెలుస్తోంది. అప్పటివరకు ఏదో ఒక యాడ్‌, ఫొటో షూట్‌ చేస్తూ బిజీగా ఉండాలని నిర్ణయించుకుందట.

వ్యాపకానికి వ్యాపకం, సంపాదనకు సంపాదన. భలే తెలివి కదా కాజల్‌ ది. అన్నట్లు డెలివరీ అయిన ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకొని సినిమాల్లో నటించే ఆలోచనలో ఉందట కాజల్. సో తిరిగి చందమామను వెండితెరపై చూడటానికి ఎక్కువ సమయం పట్టదన్నమాట. ముందు చెప్పుకున్నట్లు బాలీవుడ్‌లో కరీనా కపూర్‌, అనుష్క శర్మ కూడా ఇదే పని చేశారు. గర్భవతిగా ఉన్న రోజుల్లో దానికి సంబంధించిన యాడ్స్‌, ఫొటో షూట్స్‌ చేశారు. అవగాహనకు అవగాహన.. డబ్బుకు డబ్బు అనుకున్నారు. ఇప్పుడు కాజల్‌ కూడా అదే అనుకుంటోంది.

1

2

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus