సమంత బాటలోనే ఇప్పుడు కాజల్ కూడా?

హెడ్డింగ్ చూసిన వారెవరైనా షాక్ కి గురవ్వడం ఖాయం. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ చిత్రాన్ని సౌత్ లో అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో తమన్నాతో ఈ రీమేక్ ను తెరకెక్కించారు. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. తమిళంలో కాజల్ నటిస్తుంది. నిజానికి ఈ రెండు చిత్రాల షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. కానీ మితిమీరిన బడ్జెట్ పెట్టడం.. అంత మొత్తానికి బిజినెస్ కాకపోవడంతో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కాజల్ తో మళ్ళీ ‘క్వీన్’ రీమేక్ ఏంటి అనేగా మీ డౌట్? అయితే ఇది వేరే ‘క్వీన్’.

8 ఏళ్ల క్రితం వచ్చిన కొరియన్ మూవీ ‘డాన్సింగ్ క్వీన్’ ను.. ఇప్పుడు తెలుగులో కాజల్ తో రీమేక్ చేయబోతున్నారట. గతేడాది సమంత తో ‘ఓ బేబీ’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత సురేష్ బాబు.. ఈ రీమేక్ ను కూడా నిర్మించబోతున్నారట. అయితే ‘ఓ బేబీ’ కూడా ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘డాన్సింగ్ క్వీన్’ రీమేక్ లో కాజల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. కీలక పాత్ర కోసం అల్లరి నరేష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతుందని సమాచారం.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus