Kajal: ఆ విషయంలో కాజల్ గ్రేట్ అంటున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ రీఎంట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ బ్యూటీ సత్యభామ, ఇండియన్2 సినిమాలతో బిజీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే కాజల్ అగర్వాల్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కాజల్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

కాజల్ తన ఫస్ట్ ప్రియారిటీ నీల్ కిచ్లూ అని చెప్పుకొచ్చారు. సత్యభామ లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సుమన్ చిక్కాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధిస్తే మాత్రం కాజల్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కాజల్ (Kajal) ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తొలిసారి కాజల్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నటించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయని ఆమె చెప్పుకొచ్చారు. కాజల్ అగర్వాల్ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. కాజల్ ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు.

వరుస విజయాలను సొంతం చేసుకుంటే కాజల్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాజల్ అగర్వాల్ వయస్సు 38 సంవత్సరాలు కాగా ఇండస్ట్రీలో దాదాపుగా అందరు హీరోలతో ఈ బ్యూటీ నటించారు. కాజల్ అగర్వాల్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ కావడంతో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. కాజల్ అగర్వాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై కూడా ఈ బ్యూటీ దృష్టి పెట్టారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus