Kajal.Balakrishna: బాలయ్య కు కాజల్ పెట్టిన కొత్త పేరు ఏంటో తెలుసా..!

వెండితెర మీద అలరించే హీరోలను వారి అభిమానులు వివిధ పేర్లతో ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా అలానే పిలుచుకుంటారు. ఆయన మీదున్న అభిమానాన్ని చాటుకోడానికి ‘జై బాలయ్య’ అనే స్లోగన్ ఇస్తుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్యకు ఓ కొత్త పేరు పెట్టింది. బాలకృష్ణ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఆదివారం వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై బాలయ్యను కాజల్ ‘బాల్స్’ అని పిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కాజల్ అగర్వాల్ (Kajal) మాట్లాడుతూ.. ‘భగవంత్ కేసరి’ నాకు చాలా చాలా స్పెషల్ మూవీ. బాలయ్య గారు ఒక గ్రేట్ లెజెండ్. బిగ్ సూపర్ స్టార్ అయ్యుండి ఎంతో హంబుల్ గా, డౌన్ టూ ఎర్త్ గా, ఒక ఫ్రెండ్ లా ఉంటారు. ‘నన్ను సార్ అని పిలవద్దు, బాల్స్ అని పిలవు’ అని ఆయన నాతో చెప్పారు. బాల్స్.. థాంక్యూ సో మచ్. మీతో కలిసి వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను.

మీరు అందరికీ ఇన్స్పిరేషన్. మీ లెగసీ ఆకాశాన్ని దాటి వేరే ప్లానెట్స్ కి కూడా చేరుకోవాలని కోరుకుంటున్నాను. అనిల్ రావిపూడితో వర్క్ చేయడం ఆనందంగా వుంది. శ్రీలీల మంచి ట్యాలెంటెడ్ ఉన్న అమ్మాయి. వండర్ ఫుల్ పర్శన్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అభిమానులకు కృతజ్ఞతలు అని అన్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus