కాజల్ ఇన్స్పిరేషనల్ కామెంట్స్ వైరల్..!

కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు కావస్తున్నప్పటికీ.. ఇంకా స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంతో పాటు తమిళంలో కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్2’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ లాక్ డౌన్ టైములో సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా తమ జీవిత అనిభావాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా కాజల్ కూడా ఈ లిస్టు లో జాయిన్ అయ్యింది. ‘ ‘మన చిన్నప్పడు పెద్దయ్యాక ఎమవ్వాలి?’ అనే విషయం పై ఓ ఆలోచన ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది ఓ గోల్ ను పెట్టుకుని కష్టపడతారు. అలాగే నేను కూడా చిన్నప్పుడు ఒకటి అనుకున్నాను. కానీ తరువాత వేరేలా జరుగుతుండడంతో నేను గందరగోళానికి గురయ్యాను. అలాంటి టైంలో నేను ఒకటి అనుకున్నాను. నేను ఏ పని చేస్తే.. నా మనసుకి నచ్చుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో మొదట ఓ యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను.. అలా 16 ఏళ్ళ వయసులోనే సంపాదించడం మొదలు పెట్టాను.

కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మధ్యలో సెలవులు వస్తే అప్పుడు కూడా సంపాధించడానికి ఏదో ఒక పని వెతుక్కునేదాన్ని. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ‘రిలయన్స్’ కంపెనీలో 10 నెలల పాటు పనిచేశాను. అటు తరువాత ‘ఎం.బి.ఏ’ చదువుతున్నప్పుడు సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా నేను నటిగా మారి సంపాదించడం మొదలు పెట్టాక.. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఇప్పుడు నేను చాలా హ్యాపిగా ఉన్నాను’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus