ఎన్టీఆర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు… ‘యమదొంగ’ చిత్రంతో హిట్ ఇచ్చి ఆదుకున్నాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను కొత్తగా ప్రెజెంట్ చేసాడు. చెప్పాలంటే ఓ కొత్త ఎన్టీఆర్ ను పరిచయం చేసాడనే చెప్పాలి. ఈ చిత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్. ఎందుకంటే తాత (సీనియర్ ఎన్టీఆర్) ను మనవడిని ఓకే స్క్రీన్ పై చిందేశాలా చేసి.. ప్రశంసలు అందుకున్నాడు రాజమౌళి. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్ గా ప్రియమణి నటించింది. అయితే దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట ప్రియమణిని అనుకోలేదట.
మన కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నాడట. కానీ మోహన్ బాబు వల్లే .. ‘యమదొంగ’ నుండీ కాజల్ ను తీసేశారట. దానికి ప్రధాన కారణం ఏంటంటే.. కాజల్ ను అప్పట్లో మోహన్ బాబు కొడుకు విష్ణు సినిమాలో హీరోయిన్ గా చెయ్యమని సంప్రదిస్తే.. ఆ ఆఫర్ ను కాజల్ రిజెక్ట్ చేసిందట. దాంతో మోహన్ బాబుకి కోపం వచ్చింది.యమదొంగ సినిమాలో ‘కాజల్ హీరోయిన్ గా నటిస్తే నేను నీ సినిమాలో నటించను’ అని మోహన్ బాబు.. రాజమౌళితో తేల్చి చెప్పేశాడట.అసలే ఈ చిత్రంలో మోహన్ బాబు రోల్ చాలా కీలకం. ఆ పాత్ర ఆయన చేస్తేనే అందం.
అందుకే రాజమౌళి కాజల్ ను లైట్ తీసుకుని ఆమె ప్లేస్ లో ప్రియమణిని తీసుకున్నాడు. హీరోయిన్ పాత్రకు ప్రియమణి కూడా న్యాయం చేసిందనుకోండి..! ఇక రాజమౌళి తన తరువాతి సినిమా ‘మగథీర’ లో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడం.. కాజల్ కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చిపెట్టడం జరిగింది. ‘యమదొంగ’ సినిమాలో కాజల్ కు ఛాన్స్ దక్కి ఉంటే.. ‘చందమామ’ సినిమా కంటే ముందే క్రేజీ హీరోయిన్ అయ్యుండేదేమో…! ఇది పక్కన పెడితే ఇన్నాళ్లకు… మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో నటిస్తుంది కాజల్..!