Kalaavathi Song: సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ రికార్డు బ్రేక్ చేసిన కళావతి!

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత విడుదలైన మొదటి పాట కూడా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. థమన్ స్వరపరిచిన రొమాంటిక్ మెలోడీ పాట గా వచ్చిన కళావతి సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూవ్స్ అందుకున్న యూ ట్యూబ్ లిరికల్ వీడియో సాంగ్ గా గుర్తింపు పొందింది.

Click Here To Watch

పాత రికార్డులన్నింటినీ కూడా ఈ పాట బ్రేక్ చేయడం విశేషం. అంతే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక లైకులు అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ గా కూడా కళావతి సంచలనం సృష్టించింది. సినిమా పాటలో మహేష్ బాబు కీర్తి సురేష్ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది అనే చెప్పాలి. ఇద్దరు కూడా పాటలో చాలా అందంగా కనిపించారు. ఇక కళావతి సాంగ్ 25 గంటల్లో 14.78 మిలియన్ల వ్యూస్ అందుకోగా ఇది ఆల్ టైం సౌత్ రికార్డుగా క్రియేట్ అయింది.

ఇక 806.3k లైక్స్ రాగా ఇది ఆల్ టైమ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుగా నమోదైంది. ఇంతకుముందు 24 గంటల్లో పుష్ప ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. లిరికల్ పాట యూట్యూబ్ లో 12.39 మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా ఇప్పుడు కళావతి ఆ రికార్డును 20 గంటల్లోనే బ్రేక్ చేసింది. మొత్తానికి కళావతి పాట అయితే సర్కారు వారి పాట సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు చాలా క్లారిటీ గా అర్థమైంది. మే 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus