ఏపీ ఎన్నికలు మే నెల 13వ తేదీన జరగనున్న నేపథ్యంలో కల్కి (Kalki 2898 AD) సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోక తప్పదని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని భోగట్టా. తెలుస్తున్న సమాచారం ప్రకారం మే 30వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మూడు వారాలు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుందని సమాచారం.
అక్టోబర్ నెల 30వ తేదీన గేమ్ ఛేంజర్ థియేటర్లలో విడుదల కానుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ , గేమ్ ఛేంజర్ సినిమాలు 5 నెలల గ్యాప్ లో థియేటర్లలో ఒకే తేదీన రిలీజ్ కానున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
కల్కి 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా గేమ్ ఛేంజర్ మూవీ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు బిజినెస్ విషయంలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కల్కి, గేమ్ ఛేంజర్ సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, చరణ్ కెరీర్ లకు తమ సినిమాలు సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.
ప్రభాస్ (Prabhas) , రామ్ చరణ్ (Ram Charan) మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. దేవర (Devara) సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ ఏడాది రిలీజవుతున్న క్రేజీ సినిమాలలో కల్కి, గేమ్ ఛేంజర్ సినిమాలు ముందువరసలో ఉంటాయి. ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.