Prabhas: ఆ రేంజ్ లో బీజీఎం.. కల్కి మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కు కేవలం 90 రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుండగా టీజర్ రిలీజ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా సంతోష్ నారాయణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రభాస్ (Prabhas) సినిమా కోసం నేను ఇప్పటికే సాంగ్స్ కంపోజ్ చేశానని ఆ సినిమా కోసం మళ్లీ మళ్లీ వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కల్కి 2889 ఏడీ సినిమా ద్వారా ప్రభాస్ మాస్ అప్పీల్ ను ఆడియన్స్ కు చూపించాలని ఫీలవుతున్నానని ఆయన తెలిపారు. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ కియేట్ చేస్తున్నానని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ భారీగా ఉంటుందని నా మ్యూజిక్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నానని సంతోష్ నారాయణ్ పేర్కొన్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి తమ వంతు కష్టపడుతున్నారు. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత అశ్వినీదత్ 800 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రాజాసాబ్, సలార్2, స్పిరిట్ మరికొన్ని సినిమాలలో ప్రభాస్ నటిస్తుండగా ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus