కల్పికా గణేష్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2009లో వచ్చిన ‘ప్రయాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కల్పిక ఆ తర్వాత రాంచరణ్ నటించిన ‘ఆరెంజ్’, వెంకటేష్- మహేష్ బాబు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘జులాయి’ ‘సారొచ్చారు’ ‘పడి పడి లేచె మనసు’ ‘హిట్’.. వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ‘యశోద’ మూవీలో కూడా ఈమె మంచి పాత్ర పోషించింది.
ఈ మూవీలో ఆమె సమంతతో పాటు ఓ గర్భిణి స్త్రీగా కనిపించింది. అలాగే సినిమా స్టార్టింగ్ లో సమంతని సిగిరెట్ల కోసం ర్యాగింగ్ చేసే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది. ఈ చిత్రంలో కల్పిక పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. సీరియస్ గా సాగుతున్న సినిమాలో కొంత రిలీఫ్ పార్ట్ గా అనుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ‘యశోద’ సినిమాకి ముందు సమంత మోయాసిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే సమంత కంటే 13 ఏళ్ళ ముందు నుండి కల్పిక కూడా మోయాసిస్ తో బాధపడుతున్నట్లు చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ విషయం పై కల్పిక స్పందిస్తూ.. ” సమంత మాత్రమే కాదు నేను కూడా మోయాసిస్ తో బాధపడుతున్నాను. నేను 13 ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాను.
అయితే నాది ఫస్ట్ స్టేజ్ అయితే, సమంత ది థర్డ్ స్టేజ్. ఆమె త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అంటూ కల్పిక తెలిపింది. యశోద తో పాటు వీరిద్దరూ కలిసి గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటించింది.