కళ్యాణ్ రామ్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

గతేడాది ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని హిట్ సినిమాతో రావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం పలు కథలు వింటున్న ఈ హీరో ఓ కథను లాక్ చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని టేకప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రవీందర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట.

ఈ కథలో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపిస్తాడట. గతంలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు త్రిపాత్రాభినయం పోషించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. మూడు పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడమంటే మామూలు విషయం కాదు.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కథపై నమ్మకంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల నుండే ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ ఆశిస్తున్న విజయం అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus