Kamal Haasan, Rajinikanth: లెజెండ్స్ కలయిక..ఒకే ఫ్రేమ్లో రజనీ, కమల్.. వైరల్ అవుతున్న వీడియో!

రజినీకాంత్- కమల్ హాసన్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు. కాలంతో సంబంధం లేని స్టార్ డం వీరిది. అక్కడ ఎంతమంది స్టార్లు ఉన్నా కమల్, రజనీ..ల స్థాయి వేరు. కమల్ హాసన్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న రోజుల్లో రజినీకాంత్ వరుసగా.. కమర్షియల్ సబ్జెక్టులు ఎంపిక చేసుకుని, కమల్ కంటే ముందు స్థానానికి వెళ్లారు. కమల్ కమర్షియల్ సినిమాల్లో నటించింది చాలా తక్కువ. ప్రయోగాత్మక చిత్రాలు, నటనకు ఆస్కారం ఉన్న సబ్జెక్టులు అయన ఎక్కువగా ఎంపిక చేసుకునే వారు.

అయితే కమల్, రజినీ..లకి లైఫ్ ఇచ్చింది మాత్రం లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో రజనీ- కమల్.. కలిసి చాలా చిత్రాల్లో నటించారు. అయితే వాళ్ళకి స్టార్ డం వచ్చిన తర్వాత కలిసి నటించడం మానేశారు. 1976 లో వీరి కాంబినేషన్లో ‘మూండ్రు ముడిచ్చు’ వచ్చింది. అలాగే ‘అపూర్వ రాంగంగల్’ ‘అంతులేని కథ’ ‘అవర్గల్’ ‘పాతినారు వయానీల్’ ‘వయసు పిలిచింది’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రజినీకాంత్ తన కూతురు డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలాం’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

మరోపక్క కమల్ (Kamal Haasan) కూడా ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. అలాగే జ్ఞానవేల్ డైరెక్షన్లో రజినీ ఓ సినిమా చేస్తుండగా, మణిరత్నం డైరెక్షన్లో కమల్ కూడా ఓ బడా మూవీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ లెజెండ్స్ ఒకే లొకేషన్లో కలిసి కనిపించారు. ఇద్దరి హీరోల సినిమాల షూటింగ్లు ఒకేచోట జరుగుతుండటంతో .. ఇలా అనుకోకుండా కలిసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus