ఈ మధ్యనే రజినీ కాంత్ అనారోగ్యం పాలయ్యారని ఓ లేఖ సోషల్ మేడలో షికారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లేఖ రాసింది ఆయన కాకపోయినప్పటికీ అందులో ఉన్న విషయం మాత్రం వాస్తవమేనని…అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు రజినీ చెప్పుకొచ్చారు.గతంలో ఓసారి రజినీకి కిడ్నీ మార్పిడి జరిగింది. కాబట్టి ఆయనకి ఇమ్మ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుందట. ఈ టైములో కరోనా వంటి వైరస్ భారిన పడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ వంటి పలువురు నటీమణులు.. ‘రజినీ ఆరోగ్యంగా ఉండడమే మనకి ముఖ్యం’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ వంతు వచ్చింది. ఆయన రజినీ అనారోగ్యం పై స్పందిస్తూ… “నా ప్రియమిత్రుడు రజనీకాంత్ ఆరోగ్యంగా ఉండడమే నాకు ముఖ్యం. రాజకీయాలు అనేవి తరువాత..! ముందు ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను.
ఎన్నికలు వచ్చేటప్పుడు నేను రజనీ మద్దతు కోరుతాను. అందులో అనుమానమే లేదు. అయితే.. రజినీ తన సొంత పార్టీని ప్రారంభించాలి అనుకుంటే… అది పూర్తిగా ఆయన ఇష్టం. అలాంటి విషయాల పై స్పందించడం అలాగే విమర్శలు చెయ్యడం అనేది ఇప్పుడు సరైనది కాదు” అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.