మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమా మరో బాహుబలి అవుతుందని ఈ సినిమా మేకర్స్ భావించగా తమిళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఇతర భాషల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా కమల్ హాసన్ పొన్నియిన్ సెల్వన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ మాట్లాడుతూ సినిమా బాగుంటే ఏ భాష ప్రేక్షకులు అయినా ఆదరిస్తారని ఆయన అన్నారు.
మనం వాళ్ల శంకరాభరణం సినిమాను మనం ఆదరించామని వాళ్లు మన మరోచరిత్ర సినిమాను ఆదరించారని ఆయన కామెంట్లు చేశారు. పొన్నియిన్ సెల్వన్ మూవీ తమిళ చారిత్రక కథ అని ఇతర భాషల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలనే నియమం లేదని కమల్ హాసన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ విషయంలో ఇతర భాషల ప్రేక్షకులకు దూషించడం తగదు అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చోళ రాజులు హిందువులు కాదని కమల్ హాసన్ అన్నారు.
రాజరాజచోళుడు పాలించిన సమయంలో అసలు హిందుత్వమే లేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. అప్పట్లో హిందూమతం లేదని ఆయన కామెంట్లు చేశారు. శైవం, వైష్ణవం మాత్రమే అప్పుడు ఉన్నాయని కమల్ హాసన్ కామెంట్లు చేశారు. మన దేశంలోకి బ్రిటిష్ వాళ్లు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఏ విధంగా పిలవాలో తెలియక హిందువులు అని సంబోధించారని కమల్ హాసన్ పేర్కొన్నారు. కళలకు భాష, కులం, మతం లేదని ఆయన కామెంట్లు చేశారు.
భాష, కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. కమల్ హాసన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్2 సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.