కమల్ హాసన్ హీరోగా ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ఎటువంటి అంచనాలు లేకుండా జూన్ 3న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు బయ్యర్స్ కు కూడా ఈ మూవీ భారీ లాభాలను అందించింది. థియేటర్లలో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్ సెప్టెంబర్ 11న స్టార్ మా లో సాయంత్రం 5:30 కి టెలికాస్ట్ అయ్యింది.
ఇక్కడ కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. టి.ఆర్.పి రేటింగ్ విషయంలో రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ బుల్లితెర పై మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. టీవీల్లో విక్రమ్ ప్లాప్ గా మిగిలింది. మొదటిసారి టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు ఈ మూవీ కేవలం 5.1 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు రూ.8 కోట్లకు కొనుగోలు చేశారు అని వినికిడి.
కాబట్టి వీరు సేఫ్ అవ్వాలంటే ‘విక్రమ్’ మూవీ ఇంకో రెండు సార్లు టెలికాస్ట్ అయినప్పుడు అదే రేటింగ్ ను నమోదు చేయాల్సి ఉంది. అదేంటో కానీ థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాలను జనాలు ఎక్కువగా చూసేయడం వలనో ఏమో కానీ.. టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు పెద్దగా చూడటం లేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 3’ లు కూడా టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు మంచి రేటింగ్ ను నమోదు చేయలేకపోయాయి.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!