ప్రముఖ ఫైట్ మాస్టర్, హిందూ మున్నాని కార్యకర్త అయిన కనల్ కణ్ణన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కనల్ కణ్ణన్ ట్విట్టర్‌లో క్రైస్తవ మతాన్ని కించపరుస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో డీఎంకే పార్టీకి చెందిన ఐటీ వింగ్ డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెట్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతే జులై 1న కనల్ కణ్ణన్‌పై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న అంటే జూలై 10 న అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనల్ చేసిన పోస్ట్ ను గమనిస్తే.. అందులో ఓ చర్చి ఫాదర్ అమ్మాయితో డాన్స్ చేస్తున్నట్లు ఉంది, విదేశీ మత సంస్కృతి ఇదేనా అంటూ అతను కామెంట్ కూడా పెట్టాడు. ఆస్టిన్ బెన్నెట్ ఈ లైన్ ను హైలెట్ చేస్తూ కంప్లైట్ లో పేర్కొన్నాడట. ఇక సైబర్ క్రైమ్ పోలీసులు కనల్ కణ్ణన్‌పై కేసు నమోదు చేసి సోమవారం నాడు విచారణకు తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు.
తన లాయర్లతో కలిసి కనల్ కణ్ణన్ (Kanal Kannan) సోమవారం నాడు విచారణకు హాజరవ్వడం జరిగింది.రాత్రి 7 గంటల సమయానికి కనల్ కణ్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక కనల్ కణ్ణన్ తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా ‘అన్నయ్య’ ‘ఆజాద్’, ‘ఎదురులేని మనిషి’ ‘హనుమాన్ జంక్షన్’, ‘సీమ సింహం’, ‘విష్ణు’, ‘బన్నీ’, ‘భద్ర’, ‘అందరివాడు’, ‘భగీరథ’, ‘మహానంది’, ‘లక్ష్మీ’, ‘అస్త్రం’, ‘స్టాలిన్’, ‘ఎవడైతే నాకేంటి’, ‘ఢీ’, ‘తులసి’, ‘నాయక్’, ‘మిర్చి’, ‘తడాఖా’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘లెజెండ్’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలకి ఫైట్ మాస్టర్ గా పనిచేశారు.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!