Kangana Ranaut: ఫిల్మ్‌ఫేర్ కి షాకిచ్చిన కంగనా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది. చివరిగా ఆమె ‘ధాకడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కంగనా సైలెంట్ అయింది. కొంతకాలంగా ఆమె న్యూస్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఒక వెరైటీ న్యూస్ తో వార్తల్లో నిలిచింది. తనకు అవార్డు ఇస్తాన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధమైంది.

చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేట్ అవార్డులను కంగనా బ్యాన్ చేస్తూ వస్తోంది. అందులో ఫిలిం ఫేర్ కూడా ఉంది. గతంలో ఆమెకి అవార్డులు ఆఫర్ చేసినా.. రిజెక్ట్ చేసింది. అయితే ఈసారి ఫిల్మ్ ఫేర్ వాళ్లు ‘తలైవి’ సినిమాకి గాను కంగనాకు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు ఇవ్వాలనుకున్నారు. దీనికోసం ఆమెకి కాల్ చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయినా సరే ఆపకుండా తనకు కాల్ చేసి విసిగిస్తున్నారంటూ.. ఫిల్మ్ ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా.

తాను 2014 నుంచి అవార్డులను బహిష్కరిస్తున్నానని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతి మయమని.. ఇప్పుడు ‘తలైవి’ సినిమాకి తనకు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నారంటూ కంగనా వెల్లడించింది. తను అవార్డు వద్దని చెప్పినప్పటికీ తన పేరుని నామినేట్ చేయడం పట్ల తాను షాకయ్యానని.. ఇలాంటి అవినీతి అవార్డులు అందుకోవడానికి తన విలువలు ఒప్పుకోవని చెప్పుకొచ్చింది. అందుకే ఫిలిం ఫేర్ వాళ్ల మీద దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు కంగనా తెలిపింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus