Matka: ఆ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా ముందు మట్కా నిలబడుతుందా?

ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “కంగువ”(Kanguva). సూర్య  (Suriya) కథానాయకుడిగా శివ (Siva)  దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “కంగువ” బృందం సోలో రిలీజ్ కోసమే అక్టోబర్ 10 డేట్ ను వదులుకొని నవంబర్ 14కి షిఫ్ట్ అవ్వగా.. ఇప్పుడు అదే తేదీకి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తన తాజా చిత్రం “మట్కా” (Matka) విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.

Matka

నిజానికి నవంబర్ 14 తెలుగులో ఇప్పటివరకు వేరే సినిమాలేవీ ఎనౌన్స్ చేయలేదు. అందుకు కారణం “కంగువ”. భారీ బడ్జెట్ సినిమా కావడం, సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో.. తెలుగు సినిమాల దర్శకనిర్మాతలెవరూ ఆ తేదీకి వస్తున్నట్లు ప్రకటించలేదు. కట్ చేస్తే.. వరుణ్ తేజ్ “మట్కా” నవంబర్ 14కి వస్తున్నట్లు ఎనౌన్స్ చేయడం చర్చనీయంశంగా మారింది. ఎందుకంటే.. వరుణ్ తేజ్ గత సినిమాలైన “ఘని (Ghani) , గాండీవదారి అర్జున (Gandeevadhari Arjuna) , ఆపరేషన్ వేలంటైన్ (Operation Valentine)” డిజాస్టర్లుగా నిలిచాయి.

వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న “మట్కా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. మరో విషయం ఏమిటంటే.. “మట్కా” సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోన్ హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఇలాంటప్పుడు వరుణ్ తేజ్ సోలో రిలీజ్ కి ప్లాన్ చేసుకోకుండా.. పోయి పోయి “కంగువ”తో తలపడేందుకు ఎందుకు సన్నద్ధమవుతున్నాడో అతడికే తెలియాలి. మరి వరుణ్ తేజ్ చేస్తున్న ఈ రిస్క్ అతడికి సత్ఫలితాన్నిస్తుందో లేక బెడిసికొడుతుందో చూడాలి.

ఇకపోతే.. వరుణ్ తేజ్ “మట్కా” చిత్రంలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. “గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh)” తర్వాత వరుణ్ తేజ్ కి సోలో హిట్ అందించే అన్నీ అంశాలు “మట్కా”లో ఉన్నాయి. మరి ఈ రిస్కీ మూవ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో దర్శకనిర్మాతలకే తెలియాలి.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఇరకాటంలో పెట్టిన లడ్డూ ఇష్యూ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus