కన్నడ హీరో దర్శన్ కు కన్నడ గడ్డపైనే చేదు అనుభవం ఎదురైన విషయం మనకు తెలిసిందే. ఈయన నటిస్తున్న తాజా చిత్రం క్రాంతి. ఈ సినిమా జనవరి నెలలో విడుదలకు నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేయడానికి హోస్పేటలో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శన్ మాట్లాడుతూ ఉండగా ఒక అభిమాని తనపై చెప్పుతో దాడి చేశారు.
ఇక ఈవెంట్ ప్రారంభానికి ముందు దర్శన్ అభిమానులు పునీత్ అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో పునీత్ అభిమానులే హీరో దర్శన్ పై గొడవకు పాల్పడి ఉంటారని అందరూ భావించారు. ఇలా హీరో పై చెప్పుతో దాడి జరగడంతో ఈ ఘటనపై ఎంతోమంది కన్నడ నటీనటులు స్పందించి దర్శన్ కి మద్దతుగా నిలిచారు. కన్నడ హీరో సుదీప్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్,ధనుంజయ్ రమ్య వంటి ఇతర సెలబ్రిటీలు కూడా అభిమానుల వ్యవహార శైలిని తప్పుపడుతూ నటుడు దర్శన్ కు మద్దతు తెలిపారు.
ఇలా ఈ దాడి జరిగిన అనంతరం ఈ ఘటనపై మొదటిసారి నటుడు దర్శన్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సమయంలో తనకు మద్దతు తెలుపుతూ అండగా నిలిచిన నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో నాకన్నా నా సహనటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారు.ఇలాంటి ఘటనలు ఒక మనిషిని ఎప్పుడూ బలహీనపరచవని వారిని మరింత దృఢంగా మారుస్తాయని ఈయన చెప్పుకొచ్చారు.
ఇదివరకు మన కన్నడ గడ్డపై ఇలాంటి ఘటనలను ఎన్నో చూసాము.ఇలాంటి సమయంలో నాకు మద్దతుగా నిలచిన స్నేహితులకు సహనటీనటులకు కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించడానికి వచ్చిన వారికి ధన్యవాదాలు.నాపై ప్రేమను చూపిస్తున్నటువంటి పలువురు నటీనటులకు అభిమానులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా దర్శన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ రాసుకోచ్చారు.