అలా చేయడమే కన్నడ హీరోలకు కలిసొచ్చిందా?

కొన్ని సంవత్సరాల క్రితం వరకు కన్నడ సినిమాలు కర్ణాటక రాష్ట్రంలో సక్సెస్ సాధించినా ఇతర రాష్ట్రాలలో పెద్దగా సక్సెస్ సాధించేవి కావు. కన్నడ హీరోలు ఇతర భాషల్లో తమ మార్కెట్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. కన్నడలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన హీరోలను సైతం ఇతర భాషల ప్రేక్షకులు పట్టించునే వాళ్లు కాదు. కన్నడలో హిట్టైన సినిమాలను తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేసినా ఆ సినిమాలు ఎక్కువగా నష్టాలనే మిగిల్చేవి.

క్వాలిటీ విషయంలో కన్నడ నిర్మాతలు రాజీ పడేవారని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. కేజీఎఫ్ ఛాప్టర్1 భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించకపోయినా ఒక గొప్ప సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ ఛాప్టర్2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలకు సమాన స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. అయితే కేజీఎఫ్2 సినిమాకు అన్నీ కలిసొచ్చి సక్సెస్ అయిందని కొంతమంది భావిస్తున్నారు. అయితే 777 ఛార్లీ సినిమా రూపంలో కన్నడ ఇండస్ట్రీ ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం వూట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. సుదీప్ నటించిన విక్రాంత్ రోణా సినిమా సైతం తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లను సాధిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండటంతో సుదీప్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

విక్రాంత్ రోణా ఇప్పటికే పలు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని కన్నడ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కన్నడ నిర్మాతలు సైతం కథ నచ్చితే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా సినిమాలను నిర్మించడానికి సిద్ధపడుతున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.