కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‏ గుండెపోటుతో మరణించారు!

కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.ఈ వార్త అన్ని సినీ పరిశ్రమలని కుదిపేస్తోంది. ఈరోజు ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన ఆయన్ని బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయూలో చేర్చి అతనికి చికిత్స అందిస్తూ వచ్చారు డాక్టర్లు. పునీత్ కుటుంబ సభ్యులు… పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. అలాగే క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ వంటి వారు విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు.

అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. అయితే పరిస్థితి చేజారిపోయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పునీత్ రాజ్ కుమార్ ను కాపాడలేకపోయారు. పునీత్ మరణించాడు అన్న వార్తని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ మరణించాడు అంటూ ట్వీట్లు వేస్తూ అతని మృతికి సంతాపం తెలుపుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు కేవలం 46 ఏళ్లు మాత్రమే. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడే పునీత్ రాజ్ కుమార్..

‘యువరత్న’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తెలుగులో కూడా ఆయన సినిమాలు చేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడు. మహేష్ బాబు, బాలకృష్ణ వంటి వారికి ఇతను మంచి సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus